చరిత్రలో 2020
DISCLAIMER
ఈ కధలోని మాటలు,పాత్రలు ఎవ్వరినీ ఉద్దేశించినవి కాదు.అంతా కల్పితమే..
అది చంద్రమండలం.2095వ సంవత్సరం.
70 ఏళ్ళు పై బడిన మా తాతగారి పేరు ఆత్రేయ. ఇంటి వెనుక చక్కటి పెరడుని పెంచుకుంటూ...బావి నీటి స్నానం చేస్తూ ఆ పెరడు లోనే నులక మంచంలో నక్షత్రాలను చూస్తూ పడుకునేవాడు. ఇంట్లో Robos హడావిడికి… ఆ Artificial Intelligence వంట పట్టక ఇంట్లోకి పెద్దగా వెళ్ళడు.ఆయనకి ఎమన్నా కావాలి అంటే మా అమ్మ Marvin తో పంపిస్తుంది.
Marvin మనిషి కాదండోయ్...పనిమనిషి లాంటి Robo... కానీ అప్పుడప్పుడు నేను,తాతయ్య కబుర్లు చెప్పుకుంటూ ఆ నులక మంచంలోనే నిద్ర పోతాం.నాకు తాతయ్య అంటే చాల ప్రేమ.తాతయ్య లోని తెలుగు సాహిత్యాన్ని కూడా వంట పట్టించుకున్నాను.అందుకే ఇంత ఆదునిక కాలంలో కూడా తెలుగు చ్చక్కగా మాట్లాడతాను.ఎప్పటిలాగే తాతయ్య గారు రాత్రివేళ పెరటిలో నులక మంచంలో పడుకుని మణిశర్మ పాటలు వింటూ విశ్రాంతి తీసుకుంటున్నారు...నేను వెళ్ళాను...
తాతగారు... You didn't take pills…take your pills it’s too late...
వేసుకుంటా లేరా ...ఇలా రా పడుకో..ఆకాశంలో ఆ చుక్కలు చూడు ఎంత అందంగా ఉన్నాయో...
అనుకుంటూ నన్ను పక్కన పడుకోబెట్టుకున్నాడు.ఇద్దరం అలా ఆ అందమైన చల్లటి సాయంత్రపు చీకటి వెన్నెలలో ఆకాశం లో చుక్కలు చూస్తున్నాం...సన్నగా ఎక్కడో మణిశర్మ పాట కూడా వినిపిస్తుంది...
మీకు ఈ పాత పాటలు అంటే చాల ఇష్టమా తాతగారు..?అని మెల్లిగా అడిగాను..
హ హ హ...పాత నీకు రా...నాకు ఎప్పటికి కొత్తే..అసలు ఆ రోజుల్లో..మనిశర్మ,దేవి శ్రీ ప్రసాద్,గోపి సుందర్,వీళ్ళంతా ట్రెండ్ Create చేసార్రా...అసలు ఇప్పటి పాటల్లో Lyrics ఎక్కడ ఉన్నాయి...అప్పట్లో Lyrics కాస్త అటు ఇటు గా ఉన్నా కొద్దో గొప్పో సంగీతం దొరికేది.ఇంకా మా నాన్నగారి Time లో ఇళయరాజా గారు,ఘంటసాల గారు సంగీత ప్రపంచాన్ని ఎలారటా..ఆ పాటలు నేను వినలేదనుకో...అది వేరే విషయం...!అన్నారు తాతగారు..
తాతయ్య మీరు సినిమా డైరెక్టర్ అవ్వటానికి చాల కష్టపడ్డారు అని డాడి ఎప్పుడు చెప్తూ ఉంటాడు.మీరు రాసుకున్న మొదటి కధ కాకుండా వేరే కధ చేసారంట...అదే ఇప్పుడు OTD లో అంతర్వేగ...Am I right?
Absolutely Right…గర్వంగా అన్నారు తాతగారు..
మరి First Script ఎందుకు చేయలేదు?..ఎన్నో కధలు చెప్పావ్...ఆ కధ ఎప్పుడు చెప్పలేదు.చెప్పొచ్చుగా.. అని చాల ఉచ్చుకతో అడిగాను.
హా...భూమండలం లో 2016 లోనే నా Script కి పునాదులు పడ్డాయిరా అబ్బాయి...Digital age మాంచి ఊపు అందుకుంటున్న రోజులు అవి...కుర్ర కారు అంతా Social Media లోనే ఎక్కువగా గడిపేవారు.2019 చివరి నాటికీ నా కధ పూర్తి అయింది.ఎట్టకేలకి 2020 మొదటి నెలలో లో షూటింగ్ కూడా మొదలు పెట్టాను..కానీ...
కానీ..ఏమైంది తాతగారు...చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు??
నేను రాసుకున్న కధ చెప్పాలా...లేక చరిత్రలో నిజంగా జరిగిన కధ చెప్పాలా అని ఆలోచిస్తున్నాను! అని దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నారు తాతగారు.అప్పుడు నేను..
అసలు 2020 లో ఏం జరిగింది తాతయ్య...మా స్కూల్ లో ఎప్పుడూ Robotics Subjects తప్ప History కి ప్రాధాన్యత లేదు...మా Friends అంటూ ఉండగా పొడి పొడిగా వినేవాడిని...2020 was a very bad year అని వాళ్ళు తరచూ అంటూ ఉంటారు...నిజమే అంటారా?
ఒకలా Bad అని చెప్పుకోవచ్చు..ఒకలా Good అని అనుకోవచ్చు...
Good ఆ ఎలా...?
హ్మ్...అప్పటివరకు మనుషుల మనుగడ ఒక మూస ప్రపంచంలో బ్రతికేది...బ్రతుకు విలువ,ప్రాణం విలువ,మనిషి విలువ మరచిపోయి...డబ్బు,స్టేటస్,ఆడంబరాలు,కుల పిచ్చి,మతం మత్తుతో,మద్యం మత్తుతో...సమాజం రణగొణ ధ్వనుల మద్య తూగుతూ సాగేది...ఒక పక్క యువత ఏమో Social Media ఊబి లో పడి ఎటు పోతుందో తెలిసేది కాదు. అలాంటి పరిస్తితుల్లో 2020 వచ్చి గూబ మీద గట్టిగా ఒక్కటి ఇచ్చి నిజాన్ని రుచి చూపించింది.
స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తరువాత... అందరిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నాను అనే భావన కలిగేది.ఎవరి ప్రపంచం వారిది అన్నట్లుగా ఉండేది.మనుషులను బాగా చూసేవాడిని...మార్కెట్ లలో సిగ్నల్స్ వద్దా...రక రకాల ప్రదేశాలలో జనాలు సంచరించేవారు...వారి మోహాలలో ఎంతో గందరగోళం కనిపించేది.డబ్బు దాహం,కుల పిచ్చి,మత పిచ్చి...ఇలా వారిని వారు నమ్ముకోకుండా ఎదో తెలియని శక్తి ఉంది అనే భావనతో బ్రతికే వారి సంఖ్య అధికంగా కనిపించేది.సిగ్నల్స్ వద్ద ఆగినపుడు అందరు ఒకేవైపు చూస్తూ దీర్ఘ ఆలోచనల్లో మానసికంగా అనవసరపు విషపూరిత కళలను కంటూ ఒకే వైపు చూస్తుండటాన్ని తరచూ గమనించేవాడిని.ఎవరితో ఎవరు మాట్లాడుకోరు..వారి గమ్యం వారికి తెలిసేది కాదు.ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్ళడం రావడం,వెళ్ళడం రావడం...నెల జీతానికి ఎదురు చూస్తూ నిజ జీవితాన్ని తాకట్టు పెట్టే వారు...జీవితం ఎటు వెళుతుందో తెలియదు...డబ్బు అనే ఒక అవసరం చుట్టూ తిరుగుతూ..అనవసరపు సంఘర్షణలను మోస్తూ..చిరు నవ్వుకి దూరంగా..ధన వ్యామోహంలో పడి జీవితాన్ని వెల్లతీసిన వారు ఎందరో...
అప్పట్లో ఒక రచయిత ఒక మాట అనేవారు.అది నేను ఎప్పటికి మర్చిపోలేను.మనం బ్రతుకుంది అడవిలో...ఏ జంతువు ఎటు నుండి వచ్చి Attack చేస్తుందో తెలీదు...కాబట్టి చాల జాగ్రత్తగా ఉండాలి అని తరచూ చెప్తూ ఉండేవాడు.
అందరు అలాగే ఉండేవారా??
అదే సమస్య...అడవి పెద్దది కదా...ఏ జంతువుని నమ్మాలో తెలిసేది కాదు...నమ్మేలోపు మింగేస్తే..?అనే అనుమాననంతో ఆణిముత్యాలను కూడా పోగొట్టుకున్నాం.విషం లో కూడా పూర్తి శాతం విషం ఉండదు విశ్వ...కొంత శాతం దాహం తీర్చగలిగే నీరు కూడా ఉంటుంది...!
ఆడదానికి Security ఉండేది కాదు.Freedom అంతకంటే ఉండేది కాదు..పెళ్లి అనే ఆచారం పేరిట ఆడదాని కలలు కలలుగానే మిగిలిపోయేవి.కొందరు భర్తలు తమ భార్యలకి కనీస స్వతంత్రం ఇవ్వకుండా పరువు అనే భయంతో ఇంట్లోనే ఉంచి అజ్ఞానులను చేసారు.
ఇంట్లోనే ఉంచటం అంటే? తాతగారు Flow లో చెపుతుంటే...అర్ధం కాక అడిగాను...దానికి తాతగారు...
హా చెప్తాను విను..ఇప్పుడంటే మహిళలు అన్ని రంగాల్లో ఉండి వారి సత్తా చాటుతున్నారు..కానీ అప్పట్లో అలా ఉండేది కాదు....అప్పుడు మగాడు ఆడదాని కంటే ఎక్కువ అనే ధోరణి నడిచేది.భర్త తన Superiority Complex Zone లో ఉండి భార్యని చిన్న చూపు చూసి ఇంటికే పరిమితం చేయడం వలన సంగం లో జరిగే మార్పులను ఆమె అర్ధం చేసుకోలేదు.సహజంగా మహిళ చదువుకునేటప్పుడు ఇల్లు,చదువు తప్ప ఇంకోటి తెలుసుకోడానికి ఆస్కారం ఉండదు.ఇక పెళ్లి తరువాత కూడా ఆమె ఇంటికే పరిమితం అయితే కచ్చితంగా ఆ మహిళ ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిందే...ఒకవేళ భర్త అనారోగ్యం తో మరణిస్తే తరువాత ఆ మహిళ జీవితం అగమ్యంగా మారక తప్పదు.అందుకే మహిళలు ఇంటికే పరిమితం కాకుండా తమ స్వశక్తితో సమాజం లో ఉన్న లొసుగులను అర్ధం చేసుకుని తన వంతు సంపాదన ఇంటికి అందజేస్తూ తనని తానూ తెలుసుకుంటూ సమాజాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళితే చక్కటి భవిత ఉంటుంది.కానీ ఆ రోజుల్లో కొన్ని రూరల్ ప్రాంతాలలో అలా ఉండేది కాదు.కొందరు ఆడదాన్ని బయటికి పంపడం పరువు నష్టం అనే Hypocrisy లో పడిపోయి తమ భార్యలను ఇంటికే పరిమితం చేసి అజ్ఞానులను చేసేవారు.
ఇక దోపిడీదారులకు అడ్డు అదుపు ఉండేది కాదు.దోపిడీ పలు రకాలుగా ఉండేది.Hospitals లో Fees లతో నిలువు దోపిడీ చేసేవారు.Private Schools అని మద్య తరగతి కుటుంబాల రక్తం పిండేవారు.అప్పట్లో మన Education System ని అర్ధం చేసుకోవడమే పెద్ద Education...అంత Clumsy గా ఉండేది.ఇక Corporate Companies శ్రమ దోపిడీ కనిపించకుండా చేసేవాళ్ళు.రాజయకీయ నాయకులు ఇవన్ని పట్టిచుకోకుండా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ఒకరి పై ఒకరు దుర్భాషలాడుతూ పబ్బం గడుపుకునేవారు.బ్యాంకులు మాత్రం లోన్ పేరుతొ జనాలను మబ్బె పెట్టి వడ్డీల మీద వడ్డీలు వేసి పేదవాడిని కాల్చుకు తినేవారు.నిరక్షరాస్యులు స్త్రీలను హత్యాచారం చేసేవారు.
పరిస్తితులు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే...వాటి గురించి చర్చించుకోవచ్చు కదా..కొంచమైన ఉపశమనం కలిగేది!
స్పష్టత....హ హ హ...బిగ్గరగా నవ్వారు తాతయ్య.
విశ్వా....ఎంతసేపు బటాని ముచట్లు సమోసా వెకిలి నవ్వులు తప్ప అప్పట్లో స్పష్టత చాల తక్కువ...Hidden Things గురించి మాట్లాడుకోవడానికి ఒక రకమైన మొండి దైర్యం కావాలి.అప్పటి మనుషుల్లో దైర్యం లేదని కాదు...ఉంటుంది అందరిలోనూ స్పష్టత ఉంటుంది.అందరికి నిజం కనిపించేది...మనసు అనే గుహలో బూజు తెరల మాటున ఎన్నో ప్రశ్నలు అందరికి ఉండేవి.అలా భావాలకి మాట రూపం దాల్చి మాట్లాడగలిగే మాటలకోసం శోధన చేశాను.అలా నిజాలు మాట్లాడగలిగే వ్యక్తులు కొందరే ఉన్నారు.కానీ కొన్ని నిజాలు నాకు ప్రకృతి రూపం లో కనిపించేవి.
నగరాలలో ఎత్తు పల్లాల లో ధనవంతులకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉండేవి.వాళ్ళు కిటికీ తీసి చుస్తే క్రింద పల్లాల లో భస్తీలలో మురికి వాడలు కనిపించేవి..వేరుబాటు అనేది అక్కడ చాల స్పష్టంగా కనిపించేది...అంతటి దుర్బల స్తితిలో ఒక భయంకర వ్యాది ప్రపంచానికి వస్తే ఎలా ఉంటుంది విశ్వా...?బయటకి వెళితే ఎటు విన్నా Ambulance ల అరుపులు వినిపించేవి...వ్యాదిని హతమార్చడానికి వాక్సిన్ తయారు చేయడం లో పలు దేశాలు పోటీలు పడుతుండేవి.ఇక ఆ రోజుల్లో నిరక్షరాస్యులు దొంగతనాలకు దోపిడీలకు పాల్పడి జీవితాలను చిన్నా భిన్నం చేసుకునేవారు. లేనివాడిని కాలతన్నేవారు...ఉన్నవాడిని చుస్తే పొర్లు దండాలు పెట్టె వాళ్ళు.పేదవాడికి చిన్న బ్రెడ్డు ముక్క పెట్టి సేల్ఫీలు దిగుతూ వాళ్ళను వాళ్ళు Promote చేసుకునేవారు.ఇక మూడనమ్మకాలకు అడ్డు అదుపు ఉండేది కాదు. వినాయకుడు పాలు తాగేవాడు,తొమ్మిదేళ్ళ బాలుడు ప్రపంచ భవిష్యత్తు చెప్పేవాడు.వాళ్ళలో వాళ్ళే ఉదంతులను సృష్టించుకుని వాటిని కధలు కధలుగా చెప్పుకుని మత్తులో బ్రతికేవారు.ఇదంతా టెలికాస్ట్ చేస్తూ మీడియా వాళ్ళు తమ రేటింగ్ పెంచుకునేవాళ్ళు.ఇంతటి దుర్బల పరిస్తితుల్లో ప్రపంచానికి ఒక పెద్ద విపత్తు వచ్చి పడింది.అదే కరోన వైరస్.ఈ వైరస్ చాల భయంకరమైనది.ఈ వైరస్ సోకితే మనిషి శ్వాస ఆడక వ్యాది సోకిన కొద్ది రోజుల్లోనే మరణిస్తాడు.ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇట్టే సోకుతుంది.
కరోనా వ్యాది ఫస్ట్ చైనా లోని ఉహాన్ అనే నగరం లో మొదలైంది.అక్కడ డిసెంబర్ మొదటివారం నుంచి కరోనా కేసులు రిజిస్టర్ అవ్వడం మొదలు పెట్టాయి.ఆ తరువాత వ్యాది ఆ సిటీ నుంచి ప్రపంచం అంతటా వ్యాపించడం మొదలైంది.గబ్బిలాల నుంచి Pangolins అనే జంతువులకు ఈ వైరస్ Transfer అయింది అని...వాటిని తిన్న వారి నుండి ఈ కరోనా అనే వైరస్ వ్యాపించింది అని చైనా వారు ఒక కధనం ప్రకటించారు.కానీ Unofficial గా ఇంకొక కధనం కూడా ప్రపంచం అంతటా చక్కర్లు తిరిగింది.వేరే దేశాల మీద చైనా బయో వార్ చేయడం కోసం ఉహాన్ లో ఉన్న లాబ్ లో ఈ వైరస్ ని తయారు చేసే ప్రక్రియలో అనుకోకుండా వైరస్ బయటికి స్ప్రెడ్ అయింది అని ప్రపంచం అంతటా అనుకున్నారు.వ్యాది ఎలా వ్యాపించినప్పటికీ లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.ఇక వ్యాది మొదలైన రోజుల్లో భారతదేశ పరిస్తితులు ఒక్క సారిగా తారు మారు అయిపోయాయి.అన్ని రాష్టాల్లో లాక్ డౌన్ లు ఏర్పాటు చేసారు.
ఛీ కొంచం కుడా మానవత్వం లేదా బ్యాంకుల వాళ్ళకి...అని ఉద్రేకంతో అడిగాను.
మానవత్వమా....అది మరణించి అప్పటికే చాల కాలం అయింది విశ్వా...!లాక్ డౌన్ సమయం లో బయటికి రాకూడదు అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కొందరు ప్రజలు బయటకి వెళ్ళేవారు.వారిని పోలీసు వారు…లాటీలతో కొట్టేవారు.ఒక వైపు సామజిక స్పృహ లేకుండా ప్రజలు అలా ప్రవర్తిస్తుంటే...మరొక వైపు కొందరు పోలీసులు తమ విజ్ఞత మరచి ప్రజలపై లాటీ చార్జ్ అనే అధికారాన్ని వాడుకుని.. పాత కక్షలను మనసులో పెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించి అమాయకులను కూడా చర్మం చిట్లే లా దుర్భాషలాడుతూ కొట్టేవారు.దాన్ని సామాన్యులు ఎదిరించలేక చూస్తూ ఉండిపోయేవారు.నాతొ సహా...
మీరు ప్రశ్నించాల్సింది తాతగారు... అని కాస్త ఆవేశంగనే అడిగాను.
ఇలా చూడు విశ్వా...అప్పట్లో సమాజం... వితండవాదం, ఎగతాళి,విమర్శించడంలాంటి కార్య కలాపాలలో ముందంజలో ఉండేది.ఒకడు నిచ్చెన ఎక్కుతుంటే జాగ్రత్తగా ఎక్కాలి అనుకునేవారు 20 శాతం అయితే...కింద పడితే చూసి నవ్వుకుందాం అని చూసే వారు మిగతా శాతం.ఏదన్నా ప్రశ్నిస్తే సంబంధం లేని చిక్కుల్లో పడిపోయే అవకశాలు పుష్కలంగా ఉండేవి.ఇక మనుషుల ఎగతాళి మాటలతో మనలో ఉన్న ఆ కాస్త దైర్యం కూడా చచ్చిపోయి మనం మనకి దొరకకుండా పోతాం.ఆ రోజుల్లో కళ్ళ ముందు నిజం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వారిలో ఉన్న ప్రశ్నలని,ఆవేశాలని...లోపల ఉంచుకుని మిగతా వారిలాగే నటిస్తూ...మానాన్ని ప్రాణాన్ని కాపాడుకునేవారు...నాతొ సహా....
కాని మీరు రాసిన పుస్తకాలు అలా ఉండవు కదా తాతగారు...చాల విప్లవాత్మకంగా ఉంటాయి..ప్రతీది ప్రశ్నిస్తాయి.
పుస్తకాల్లో కాబట్టి ఎక్కువకాలం బ్రతికాను..Live లో అడిగి ఉంటె గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టేవారు...
😅😅... మరి ఆ రోజుల్లో ప్రభుత్వం ఈ వైరస్ ని అడ్డుకోలేదా వైరస్ వచ్చిన వారికి సదుపాయాలు ఎలా ఉండేవి?
వైరస్ భారత దేశానికి వచ్చిన మొదట్లో ప్రధానమంత్రి మరియు రాష్టాల ముఖ్యమంత్రులు చాల హడావిడి చేసారు.కొంత కాలానికి కర్ఫ్యూ తీసేసి మనందరం కరోనా తో సహజీవనం చేయాల్సిందే అని ప్రకటించారు.అప్పటివరకు ప్రభుత్వపు ఆస్పత్రులలో వ్యాదిగ్రస్తులకు అటూ ఇటూ కాని వైద్యం ఇచ్చేవారు.ఆ తరువాత ప్రైవేటు ఆస్పత్రులకు కూడా పగ్గాలు ఇచ్చారు.అప్పుడు మొదలైంది అసలైన నిలువు దోపిడి...డబ్బున్న వాడు లక్షలు కుమ్మరించి వ్యాది నయం చేసుకోడానికి ప్రయత్నించేవాడు.డబ్బు లేనివాడు రోడ్డుమీద శవం లా మారేవాడు.పేదవాడు హాస్పటల్ కి వెళ్లి నన్ను కాపాడండి అని అడిగితె లక్షలకొద్దీ ఫీసులు అడిగేవారు...ఇవ్వకపోతే పేషంట్ ని బయటకి తరిమేవారు.మూడు నాలుగు హాస్పటల్ లు తిరిగి తిరిగి రోడ్డు మీదనే ప్రాణాలను విడిచేవారు.వైరస్ ఉన్న శవాన్ని జనాలు త్రాకేవారు కాదు.బహుశా దీన్నే పేదవాడి కుక్క చావు అంటారేమో....!
మరి ధనవంతులు పేదవారిని ఆదుకోవచ్చు కదా తాతగారు???తాతగారు కాస్త నవ్వి ఇలా అంటున్నారు....
విశ్వా...అప్పటి రియాలిటీ వేరు..మంచి మాటలు మైకులకే పరిమితం.ఇక ఈ మానవత్వం,ఆదుకోవడం లాంటివి అప్పటి కమర్షియల్ సినిమాల్లో హీరోలు చేసేవారు..అది కూడా సినిమాల్లోనే బయట కాదు సుమీ...ఆ రోజులు ఎలా ఉండేవో తెలుసా విశ్వా.... భయంకర ధన పోరాట విప్లవం నడిచేది.ఒక్క మాంసపు ముద్ద పది జంతువులకు దొరికితే దాన్ని పీక్కుంటూ పక్కవాటిని గాయపరుస్తూ తినేంత పోటి నడిచేది డబ్బు పట్ల.మనుషులు కేవలం వాళ్ళ డబ్బు ప్రతిష్టలు చూపించుకోవడం కోసమే కోట్లు పెట్టి ఆడంబరంగా వేడుకలను జరుపునేవారు. అది వాళ్ళ హక్కు వాళ్ళ డబ్బు అని నువ్వు అనుకోవచ్చు...ఈ భూ ప్రపంచం అనే నీ గర్బం లో ఒక బిడ్డకి ఆకలి తీరి ఇంకొక బిడ్డ ఆకలితో ఆర్తనాదాలు పెడుతుంటే...వాడి ఆకలి కూడా తీర్చడం తల్లి భాద్యత అని నేనంటాను...అది తీర్చలేని సమాజానికి విజ్ఞత లేదంటాను.అలాంటి రక్కసి మూకల నవ్వులను పులుముకుని నిజాన్ని దాచి,అబద్దాన్ని నిజంలా మార్చి...తీరా జనాలను ఓహో ఇదే నిజమేమో అనుకునేల చేసే ఈ వ్యంగ్యపు ముసి ముసి నవ్వుల సమాజం మనకొద్దు అంటాను.....హా..హా హా
తాతయ్య...తాతయ్యా ...ఆవేశపడకండి ...
ఆయన అలా ఆవేశంతో మాట్లాడుతుండగానే తన శరీరం చీలికలుగ చీలి Particles గా ఏర్పడి మెల్లగా అవి ప్రకృతిలో కలిసిపోవడం నాకు కన్నీరు తెప్పించింది.మెల్లగా మెల్లగా అక్కడి పెరడు నేను చీలికలుగా చీలి Particles గా ప్రకృతిలో కలిసిపోయాం.నా లాబ్ మాత్రమే మిగిలింది.
మార్విన్ Program ఎందుకు Delate చేశావ్?అని మార్విన్ ని కోపంగా అడిగాను.
మీరు ఈ Memory ని ఇప్పటికి 12 Hundred Times చూసారు...చుసిన ప్రతిసారి చివరిలో మీ తాతగారు గుండె పోటుతో మరణించిన దృశ్యాన్ని చూసి ఆ చిన్న వయసులో మీరు పడే వేదనకి Human Emotions నాకు తెలిసాయి...మీరు భాదపడుతుంటే చూడటం నాకు ఇష్టం లేదు.అందుకే Program Erase చేశాను.
అదీ నిజమే అనుకున్నాను.ఆ రోజు తాతయ్య గుండె పోటుతో మరణించారు..కరోనాకి ముందు భూమండలంలో ఎలా ఉందొ చెప్పారు...కానీ ఆ తరువాత జరిగిన మంచి నాతొ పంచుకోకుండానే మరణించారు...నేను పుట్టింది చంద్ర మండలంలో కాబట్టి భూమండలపు చరిత్ర క్లుప్తంగా తెలుసుకోలేకపోయాను అసలు కరోనా తరువాత మనుషులు మారారా?వాళ్ళ జీవన విధానాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అన్నది నాకు ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.ఆయన చెప్పిన కధల్లో ఇదే చివరి కధ.
Hi...I'm విశ్వా...ఇంతసేపు నేను చిన్న పిల్లవాడిని అని అనుకుని ఉండొచ్చు...అందుకు క్షమించాలి i'm 30 years old.I am a scientist.తాతగారు 2070లో నాకు ఆ కధ చెపుతుండగా మరణించారు.ఆయన,నేను మాట్లాడుకున్న జ్ఞాపకాలను 3D Virtual Reality గా అప్పట్లోనే Create చేసి ఆ Database storage చేశాను. ఇలా ఆయనతో నేనున్న Memores ni Remind చేస్కుంటూ ఉంటాను.నేను చూసినది Virtual Reality అయినప్పటికీ తాతగారి ఆవేశం మాత్రం చరిత్రలో జరిగిన ఒక నిజం.Databaseలో ఉన్న కొన్ని కోట్ల memories లో ఇదొకటి,ఇదే చివరిది.దీంట్లో తతగారిలో ఉన్న విప్లవ భావజాలం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని బయటికి దూకింది...తతగారిలో నేను ఇది తరచూ చూసేవాడిని.అది నాకు కూడా ఇష్టమే...భగ భగ మండే సూర్యోదయం ఎంత నిజమో...ఇలాంటి రచయితల్లో ఆవేశము కూడా అంతే నిజం..END.
కల్కి కలం



కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి