నీకున్న ఆ ఇద్దరు శత్రువులు ఎవరో నాకు తెలుసు..
First Enemy Fear
ఇక్కడ
శత్రువు అంటే మనలో ఉన్న మానసిక లోపం అని నా ఉద్దేశం.మొదటిది భయం ఈ భయానికి
కల్పన కి చాల దగ్గరి సంభందం ఉంది.లేనిది సృష్టించుకుని పదే పదే దాని
గురించే ఉహించుకుని భయపడటం అనేది మనకి తెలియని ఒక ఉహా ప్రపంచం లో ప్రయాణించడం తరచూ
జరుగుతూ ఉంటుంది.అసలు భయం అనేది లేదు.దాన్ని మనం సృష్టిస్తాం...అది మన వెంట పడేలా
తరచూ మనం దాని గురుంచే ఆలోచించడం వలన అది మనలో ఇంకా ఎక్కువ అవుతుంది.చేస్తున్న పని
అవుతుందో లేదో అనే భయం,వచ్చిన ఆలోచన సరైనదో లేదో అనే
భయం.లేని విషయాలను సృష్టించుకుని ఆ ఉహలో అనేక కధలు అల్లుకుని చివరికి చేస్తున్న
పని మీద పట్టు కోల్పోయి వెనుతిరుగుతూ ఉంటుంటాం.అసలు భయాన్ని సృష్టించినది
మనిషే...మరి దాన్ని జయించడం ఎలా?అని చాల సార్లు
అనుకుంటాం...అసలు ఈ సృష్టిలో లేనిదాన్ని మనం ఎలా జయించగలం..?ఎందుకంటే
సృష్టించింది మనమే కదా...మనమే సృష్టించి మనమే దాని మీద పోరాడటం ఎందుకు?అసలు సృస్టించకుండా ఉంటె సరిపోతుంది కదా...భయం తాలూకు ఆలోచనలని ఆపటమే
దైర్యం.మన ఆలోచనల్లో భయానికి సంబందించిన కధలను సృష్టించకపోవడమే దైర్యం.ఒక వంద మందిలో ఒక వ్యక్తీ
వెళ్లి స్టేజ్ మీద అనర్గళంగా మాట్లాడినపుడు బాగా మాట్లాడాడు
అంటాం...కానీ దాని వెనుక తనకి తానూ ఆత్మ శోధనలో తన భయానికి నచ్చ చెప్పి దైర్యాన్ని
నిద్ర లేపటానికి అతను పడ్డ సంఘర్షన్ మనకు కనిపించదు.వందలో ఒకడు స్పెషల్ గా
కనిపిస్తున్నాడు అంటే అది వాడిలో ఉన్న దైర్యం.నువ్వు కనిపించట్లేదు అంటే అది నీ
పిరికితనం అంటే మనం ఒప్పుకోలేము.ఎందుకంటే మనకి మనోవిజ్ఞానం కంటే జోతీశ్యం అంటే
ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక...పది మందిలో సిగ్గు లేకుండా డాన్స్ ఎంత బాగా
వేస్తున్నాడురా అని ఆలోచించకుండా...పది మందిలో సిగ్గు లేకుండా డాన్స్ చేయడానికి
వాడిలో ఉన్న భయాన్ని ఎంత బాగా చంపాడు అనేది బాగా ఆలోచిస్తే రహస్యం తెలుస్తుంది.
Second
Enemy Escapism.
అవును
మన ప్రతి కదలిక మన చుట్టూ ఉన్న మనుషులు గ్రహిస్తూనే ఉంటారు...మనం చేసే పనిలో
బోలెడన్ని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు...ఉదాహరణకు...హే అది నీకు సెట్
అవ్వదబ్బా....రిస్క్ ఉంటుంది.సేఫ్ గా ఆడు..ఇలాంటివి.మనం స్ట్రాంగ్ గా ఎదో అనుకుని
మొదలు పెడతాం...ఆ తరువాత వీళ్ళు అనే చిన్న చిన్న మాటలు చాలు పేక మేడ కుప్ప
కూలడానికి...ఇంకేం మాములుగానే మనుషులది అవకాశం దొరికితే తప్పించుకునే స్వభావం
కాబట్టి ఆ పని మధ్యలోనే వదిలేస్తాం.కాబట్టి ఫ్రెండ్స్...ఒక్కసారి ఫిక్స్ అయితే నా
మాట నేనే వినను అనే స్వభావంతో దూసుకువెల్లడమే సరైన పద్దతి...చీకటిలో ఎదో ఉంది ఎదో
ఉంది అని భయపడే
బదులు చీకటిని చేదించి శోదించి సాధించడమే జ్ఞాని
లక్షణం.మన దేశంలో మానసిక వైద్యుల కంటే జోతిష్యులు ఎక్కువ కాబట్టి మానసిక లోపాలను
మనలో మనమే ఎడిట్ చేసుకుని విషపూరిత ఆలోచనలను,అవసరం లేని
భయాలను బయటికి పారద్రోలి ముందుకు వెళదాం...అసలైన జీవితం అనేది Comfort Zone దాటితేనే మొదలవుతుంది. జై హింద్.
కల్కి కలం.
ఫ్రెండ్స్... ఈ బ్లాగ్ నీ మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో బటన్ క్లిక్ చేయండి.అలాగే
మెయిల్ బాక్స్ లో మీ మెయిల్ ఐడి కూడా జోడించండి.నేను రాసే బ్లాగ్ లు డైరెక్ట్ గా
మీ మెయిల్ కి వస్తాయి.థాంక్ యు…
What you said is very very close to everyone's life.
రిప్లయితొలగించండిYou have better writing skills.
Hope you reach your goals.