చరిత్రలో 2020
DISCLAIMER ఈ కధలోని మాటలు,పాత్రలు ఎవ్వరినీ ఉద్దేశించినవి కాదు.అంతా కల్పితమే.. అ ది చంద్రమండలం. 2095 వ సంవత్సరం. 70 ఏళ్ళు పై బడిన మా తాతగారి పేరు ఆత్రేయ. ఇంటి వెనుక చక్కటి పెరడుని పెంచుకుంటూ...బావి నీటి స్నానం చేస్తూ ఆ పెరడు లోనే నులక మంచంలో నక్షత్రాలను చూస్తూ పడుకునేవాడు. ఇంట్లో Robos హడావిడికి … ఆ Artificial Intelligence వంట పట్టక ఇంట్లోకి పెద్దగా వెళ్ళడు.ఆయనకి ఎమన్నా కావాలి అంటే మా అమ్మ Marvin తో పంపిస్తుంది. Marvin మనిషి కాదండోయ్...పనిమనిషి లాంటి Robo ... కానీ అప్పుడప్పుడు నేను,తాతయ్య కబుర్లు చెప్పుకుంటూ ఆ నులక మంచంలోనే నిద్ర పోతాం.నాకు తాతయ్య అంటే చాల ప్రేమ.తాతయ్య లోని తెలుగు సాహిత్యాన్ని కూడా వంట పట్టించుకున్నాను.అందుకే ఇంత ఆదునిక కాలంలో కూడా తెలుగు చ్చక్కగా మాట్లాడతాను.ఎప్పటిలాగే తాతయ్య గారు రాత్రివేళ పెరటిలో నులక మంచంలో పడుకుని మణిశర్మ పాటలు వింటూ విశ్రాంతి తీసుకుంటున్నారు...నేను వెళ్ళాను... తాతగారు... You didn't take pills…take your pills it’s too late.. . వేసుకుంటా లేరా ...ఇలా రా పడుకో..ఆకాశంలో ఆ చుక్కలు చూడు ఎంత అ...